కోహ్లీ తర్వాతి కెప్టెన్ కేఎల్ రాహుల్...

కోహ్లీ తర్వాతి కెప్టెన్ కేఎల్ రాహుల్...

భారత జట్టుకు విరాట్ కోహ్లీ తర్వాత కేఎల్ రాహుల్ కెప్టెన్ అవుతాడని భారత మాజీ ఆటగాడు, ప్రస్తుత వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఈ మధ్య అభిమానులతో చిట్ చాట్ చేసిన చోప్రా అందులో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అయితే ఓ అభిమాని.. కింగ్స్ ఎలెవన్ జట్టు కెప్టెన్ గా ఈ ఏడాది ఐపీఎల్ లో రాహుల్ ఎలా రాణిస్తాడు అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీ నుండి తప్పుకొని ఎలాగైతే కోహ్లీకి ఆ అవకాశం ఇచ్చాడో అలాగే కోహ్లీ కూడా ఏదో ఒకరోజు కసారి కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకొని మరొకరికి ఇవ్వాలి. అప్పటికి భారత జట్టులో ఆ బాధ్యతలు అందుకోవడానికి సిద్ధంగా రాహుల్ ఉంటాడని చెప్పాడు. రాహుల్ గొప్ప కెప్టెన్ అవుతాడు అని తాను నమ్ముతున్నాను అని చెప్పిన ఆకాశ్ చోప్రా ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత అందరూ నమ్ముతారని అన్నాడు. ఆటగాడిగా అద్భుతంగా రాణిస్తున్న రాహుల్ కెప్టెన్ గా తన జట్టును గెలిపించడానికి మైదానం లో ఏ రకమైన వ్యూహాలు అమలు చేస్తాడో చూడాలి అని అన్నాడు. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఈ ఏడాది ఐపీఎల్ మరో 5 రోజులో యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది.