భర్త కోరిన ఆ కోరిక తీర్చలేక...ఆ భార్య ఏం చేసిందంటే... 

భర్త కోరిన ఆ కోరిక తీర్చలేక...ఆ భార్య ఏం చేసిందంటే... 

భార్య భర్తల మధ్య వివిధ విషయాల్లో గొడవలు  రావడం మాములే.  కుటుంబం విషయంలో, పిల్లల విషయంలో గొడవలు పడుతుంటారు.  అయితే, ఈ జంట మాత్రం బెడ్ రూమ్ విషయంలో గొడవ పడ్డారు.  భర్త కోరిన అసాధారణమైన బెడ్ రూమ్ కోరికను విని భార్య షాక్ అయ్యింది.  అప్పటికే వారికి పెళ్ళయ్యి ఎనిమిదేళ్లు అయ్యింది.  ఓ పాప కూడా ఉన్నది. వద్దని నచ్చచెప్పినా వినలేదు.  పైగా భార్యపై చేయి చేసుకున్నాడు.  దీంతో భార్యకు విపరీతమైన కోపం వచ్చింది.  

ఆ కోపంలో బంధువుల సహాయంతో హత్య చేసింది.  భర్త మంచం మీదనుంచి కింద పడ్డాడని, హాస్పిటల్ కు తీసుకెళ్లగా, వైద్యులు భర్త మరణించినట్టు తెలిపారు.  అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు వైద్యులు.  పోస్ట్ మార్టం రిపోర్ట్ లో హత్య చేసినట్టు తేలింది.  వెంటనే పోలీసులు తమ స్టైల్ లో భార్యను విచారించగా అసలు విషయం బయటపడింది.  భర్త కోరిన అసాధారణమైన ఆ కోరికను తీర్చలేక హత్య చేసినట్టు తెలిపింది.  ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.