అయోధ్య: 4 రోజుల్లోనే ఆ స్వీట్ న్యూస్

అయోధ్య: 4 రోజుల్లోనే ఆ స్వీట్ న్యూస్

అయోధ్య విషయంలో త్వరలోనే ఓ తీపికబురు వింటారని ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ మహేంద్రనాథ్ పాండే అన్నారు. రామమందిర్ విషయంలో దీపావళి వరకు ప్రజలు వేచిచూడాలని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీపికబురు వినిపిస్తారన్నారు. ఈ విషయంలో సీఎం ఇప్పటికే ఓ వ్యూహం రూపొందించి ఉంటారని, అది ఆయన నోట వింటేనే బాగుంటుందన్నారు. యోగి ముఖ్యమంత్రే కాక సన్యాసి కూడానని, కాబట్టి అయోధ్య విషయంలో పక్కా ప్రణాళిక రూపొందించి ఉంటారన్నారు. అందుకని దీపావళి వరకు వేచి చూస్తే శుభవార్త వింటారని, ఆ ప్రణాళిక ఏమిటనేది ఆయనే వివరిస్తారని చెప్పారు. 

అటు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు నిన్ననే సమావేశమై అయోధ్య విషయంలో ఆర్డినెన్స్ తీసుకురావాలని తీర్మానం చేశారు. ఆ మరుసటి రోజే యూపీ బీజేపీ చీఫ్ ఇలాంటి ప్రకటన చేయడం ఆసక్తి రేపుతోంది.