మ్యాచ్ మధ్యలో ఆసీస్ అమ్మాయికి భారత అబ్బాయి ప్రపోసల్...

మ్యాచ్ మధ్యలో ఆసీస్ అమ్మాయికి భారత అబ్బాయి ప్రపోసల్...

ఈరోజు భారత్-ఆసీస్ మధ్య రెండో వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారత్ ముందు 390 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ లక్ష్య ఛేదనలో భారత్ కొంచెం తడబడుతుంది. ఇక ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లకు అభిమానులను అనుమతిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ మధ్యలో ఓ ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే గ్రౌండ్ లో తలపడుతున్న రెండు జట్లు అయిన ఆసీస్-భారత్ అభిమానులు ఒకటయ్యారు. అసలు ఏం జరిగిందంటే.. మ్యాచ్ మధ్యలో భారత్ అబ్బాయి ఆసీస్ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. అది చూసిన కామెంటేటర్లు 'సే ఎస్, సే ఎస్'' అంటూ కామెంట్రీ చేసారు. చివరికి ఆ అమ్మాయి అబ్బాయి ప్రపోజ్ ను ఒప్పుకుంది. ఇదంతా చూసిన ఆసీస్ ఆల్ రౌండర్ గ్లేన్ మాక్స్వెల్ తన చప్పట్లతో వారికి అభినందనలు తెలిపాడు. అయితే మ్యాక్స్వెల్ కూడా ఓ భారత సంతతికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం మన అందరికి తెలుసు.