రవీంద్ర భారతి వద్ద ఆత్మహత్యయత్నం కలకలం..

రవీంద్ర భారతి వద్ద ఆత్మహత్యయత్నం కలకలం..

రవీంద్ర భారతి వద్ద ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. రవీంద్రభారతి ఎదుట ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కరోనా కారణంగా ప్రైవేటు ఉద్యోగం పోయిందని మనస్తాపం చెంది పెట్రోల్‌ పోసుకొని ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సగం శరీరం కాలినట్టు  ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఆత్మహత్యయత్నం విషయం తెలిసిన  పోలీసులు..మంటలు ఆర్పేసి,  బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడు మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ వాసిగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా మా బతుకులు మారలేదని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ‘కేసీఆర్ సార్.. జై తెలంగాణ అంటూ’ నినాదాలు చేశాడు. తమను ఆదుకోవాలంటూ చేతులు జోడించి ప్రాదేయపడ్డాడు.