కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్జీటీలో పిటిషన్

కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్జీటీలో పిటిషన్

కాళేశ్వరం విస్తరణ పనులపై దాఖలైన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. విస్తరణ పనులకు పర్యావరణ అనుమతులు లేవని వేములఘాట్‌ రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. అనుమతులు లేకుండానే రూ.21 వేల కోట్ల పనులు చేపట్టారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అనుమతులు పొందేవరకు పనులు ఆపేలా చూడాలని కోరారు. కాళేశ్వరంపై ఎన్జీటీ ప్రధాన బెంచ్‌లో విచారణ జరుగుతోందని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత.. ఈ విషయంలో తగిన పాలనాపరమైన ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ ప్రధాన బెంచ్ ను న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని చెన్నై ద్విసభ్య  గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ కోరింది.  తదుపరి విచారణ ఆగస్టు 5కు వాయిదా వేసింది.