కత్తితో బెదిరించాడని పోలీసులు ఏం చేశారంటే..

కత్తితో బెదిరించాడని పోలీసులు ఏం చేశారంటే..

మాడ్రిడ్: కత్తి తీసుకొని బెదిరించడంతో పోలీసులు ఓ వ్యక్తిని షూట్ చేశారు. అతడు పోలీసులను ఎందుకు బెదిరించాడు, అతడెవరనేది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన స్పెయిన్‌లోని బార్సలోనాలోని దే సాంత్ జోన్ అవెన్యూ వద్ద దాదాపు రాత్రి 7 గంటల సమయంలో జరిగింది. అయితే  అతడు అనుకోకుండా ఒక్కసారిగా పోలీసుల వద్దకు వచ్చి బెదిరించాడని, ఏ దారిలేక ఒక పోలీసు అధికారి తుపాకీని ఉపయోగించాల్సి వచ్చిందని అక్కడి అధికారులు తెలిపారు. ‘అతడు పెద్ద కత్తితో పోలీసులను బెదిరించాడు. అంతేకాకుండా అతడిని ఆపేందుకు ప్రయత్నించినా లాభంలేకుండా పోయింది. అతడా చాలా కోపంతో ఉన్నాడు. దాంతో ఏ దారీలేక ఓ అధికారి తన తుపాకీని వాడాల్సి వచ్చింద’ని నగర పోలీసులు తెలిపారు. అయితే బెదిరించిన వ్యక్తికి దాదాపు 43 సంవత్సరాలు ఉంటాయని, ప్రస్తుతం అతడిని చికిత్స కొరకు ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.