ఐశ్వర్యరాయ్ నా తల్లి... ఓ కుర్రాడి ఆరోపణ !
1994లో విశ్వసుందరిగా ఐశ్వర్యరాయ్ ఎంపికయ్యాక సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సినిమా ఇండస్ట్రీలో సైతం ఆమె దూసుకుపోయింది. వయసు పైబడుతున్నా అందంలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్న ఐష్.. ఆరాధ్య అనే చిన్నారికి జన్మనిచ్చింది. ఐశ్వర్యరాయ్‌కి ఒక్కతే కూతురు కాగా.. తాను ఐశ్వర్యరాయ్ కొడుకును అంటూ 32 ఏళ్ల సంగీత్‌కుమార్ అనే వ్యక్తి రచ్చ చేస్తున్నాడు. "నేను ఐశ్వర్యరాయ్‌కి ఐవీఎఫ్ విధానంలో పుట్టానని... 1967లో నేను ఐష్‌కు జన్మించగా..అప్పుడు ఆమె వయస్సు 15. నా తండ్రి నన్ను లండన్ నుంచి వైజాగ్‌కు తీసుకు రాగా.. ఓ రెండేళ్లపాటు ఐష్ తల్లిదండ్రులు నన్ను చూసుకున్నారు. నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఐష్ సంబంధీకులు నా బర్త్ సర్టిఫికెట్స్ అన్నీ చింపేశారు. ఐశ్వర్యరాయ్‌కు నేను మొదటి కొడుకును" అంటూ సంగీత్ కుమార్ అనే వ్యక్తి బీటౌన్‌లో హంగామా సృష్టించాడు. అయితే.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతనికి మానసిక స్థితి బాగోలేదని చెప్పారు. దీంతో ఈ విషయం అంతటితో ముగిసింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)