రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్య...

రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్య...

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల్ మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి  దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న చేవెళ్ల పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ మృతుడు వికారాబాద్ జిల్లా పరిగి మండల్ మాదారం గ్రామానికి చెందిన సత్తయ్యగా పోలీసులు గుర్తించారు. మృతుడు కూలి పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు మృతుడు ఆ సంఘటన స్థలానికి ఎందుకు వచ్చాడు, కూలి పని చేస్తు జీవనం సాగిస్తున్న అతడిని ఎవరు చంపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.