శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన శంఖు, చక్రం విరాళం

శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన శంఖు, చక్రం విరాళం

కొలిచిన వారికి కొంగు బంగారమై.. కోరిన కోర్కెలు తీర్చే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూనే ఉంటారు.. ప్రతీరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3 కోట్లకు పైగానే అంటే భక్తుల నమ్మకం ఏంటో.. వండికాసులవాడికి భక్తులు సమర్పించుకున్న కానుకలు ఏ రేంజ్‌లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.. ఇక, బంగారం, శ్రీవారికి రకరకాల బంగారు నగలు, కిరిటాలు కూడా సమర్పించే భక్తులు చాలా మందే.. కొందరు అజ్ఞాత భక్తులైతే.. మరికొందరు.. తమ కానుకలను టీటీడీకి అధికారికంగా సమర్పిస్తుంటారు.. ఇవాళ.. తిరుమల వెంకన్నకు సుమారు 2 కోట్ల రూపాయల విలువైన బంగారు ‘శంఖు, చక్రాన్ని విరాళంగా ఇచ్చారు తమిళనాడు నుంచి వచ్చి భక్తుడు. మూడున్నర కిలోల బంగారంతో శ్రీవారి కోసం శంకు, చక్రాలు తయారు చేయించారు.. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు.. వీటిని ఈరోజు ఉదయం టీటీడీ అదనపు ఏవోకు అప్పగించారు. శ్రీవారి భక్తుడైన తంగడోరాయ్.. గతంలో బంగారు, వజ్రాల ఆభరణాలను విరాళంగా ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఇందులో బంగారు నడుము, చేతులు, నగలు మరియు వజ్రాల నగలు కూడా ఉన్నాయట.