నివర్ తుఫాన్ ఆ గ్రామానికి బంగారం తెచ్చింది... 

నివర్ తుఫాన్ ఆ గ్రామానికి బంగారం తెచ్చింది... 

గత నెలలో వచ్చిన నివర్ తుఫాన్ ధాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలు వణికిపోయాయి.  చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.  ఈ వర్షాల ధాటికి అపారమైన పంటనష్టం జరిగింది.  అయితే, ఈ నివర్ తుఫాన్ ఏపీలోని ఓ గ్రామానికి మంచి చేసింది.  ఆ గ్రామంలోని ప్రజలకు బంగారం తీసుకొచ్చింది.  తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ గ్రామం గురించి అందరికి తెలుసు.  సముద్ర తీరప్రాంతంలోని గ్రామం.  అంతేకాదు, సిల్క్  చీరలకు ప్రసిద్ధి కూడా.  ఇటీవలే నివర్ తుఫాన్ తరువాత ఉప్పాడ బీచ్ లో అక్కడి ప్రజలకు బంగారం దొరికింది.  నలుగురు వ్యక్తులకు బంగారం దొరకడంతో ఈ వార్తా గ్రామం మొత్తం వ్యాపించింది.  దీంతో గ్రామంలోని ప్రజలంతా ఉప్పాడ బీచ్ కి వచ్చేశారు.  బంగారం కోసం వేట మొదలుపెట్టారు.  దగ్గరలో ఉన్న దేవాలయం సముద్రంలో కలిసిపోవడం లేదా తీరప్రాంతంలోని ఇల్లు సముద్రంలో కలిసిపోవడం వలన బంగారం ఒడ్డుకు కొట్టుకొచ్చి ఉంటుందని అధికారులు చెప్తున్నారు.  ఏదైతేనేం, నివర్ తుఫాన్ మాత్రం ఉప్పాడ ప్రజలకు కొంతమేర లాభం చేకూర్చిందని చెప్పాలి.