కొత్తగా బయట పడ్డ మరో వింత జీవి..ఎక్కడంటే..

కొత్తగా బయట పడ్డ మరో వింత జీవి..ఎక్కడంటే..

ప్రపంచం ఎప్పుడూ ఎదోక వింతతో మనల్ని అబ్బుర పరుస్తుంటోంది. రోజుకో కొత్త జంతువో, వింతో జరుగి మనలోని ఉత్సుకతను రేకెత్తిస్తోంటోంది. అయితే రోజుకు ఎన్నో వింతలను మనం మన బిజీ జీవితాలలో పడి పట్టించుకోము. కానీ కొన్ని మాత్రం ప్రపంచం మొత్తం వాటి గురించి ఆలోచించేలా చేస్తాయి. అటువంటి సంఘటనే ఒకటి దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్ బీచ్‌లో చోటుచేసుకుంది. కొన్ని బులుగు రంగు సముద్రపు జంతువులు కొన్ని వడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇవి చూడటానికి డ్రాగన్స్‌లా ఉన్నాయి. అయితే ఈ జంతువును అక్కడి స్థానికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి ఎంతో మంది కామెంట్లు, లైకులు చేశారు. దాంతో ఈ జంతువు భారీగా వైరల్ అయ్యింది. దీనికి కొందరు ఇదేం జంతువు అంటే, కొందరు మాత్రం దాన్ని తిరిగి నీళ్లల్లో పెట్టండి అది చాలా అందంగా ఉందంటూ జంతు ప్రేమని చాటుతున్నారు. కానీ ఈ జంతువు మాత్రం బులుగు రంగులో, మామూలు పక్షి రెక్కలతో చాలా కొత్తగా ఉంది. మరి ఇదేంటి అని అందరూ ఆసక్తిగా చూపుతున్నారు.