తలసేమియా బాధితుల కోసం బాలయ్య పిలుపు

తలసేమియా బాధితుల కోసం బాలయ్య పిలుపు

నందమూరి బాలకృష్ణ నటనలోనే కాదు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు . బసవతారకం ఆసుపత్రి తో ఎంతోమంది కేన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇక తాజాగా తలసేమియా బాధితుల కోసం బాలయ్య పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా, తలసేమియా బాధితుల కోసం తెలంగాణా తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న రక్త దాన శిబిరానికి వచ్చి రక్తదానం చేయాలనీ బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా  బాలయ్య తలసేమియా వ్యాధి గురించి వివరిస్తూ, రక్త దానం పట్ల ప్రచారంలో ఉన్న పలు అపోహలను తొలగించారు... ఎంత అభివృద్ధి చెందినా రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదు కాబట్టి, తోటి ప్రాణాలను కాపాడడానికి మనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం రక్త దానం మాత్రమే అని తెలుపుతూ అభిమానులు, కార్యకర్తలు, ఆరోగ్యం గా ఉన్న ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి, ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడాలని బాలకృష్ణ  పిలుపునిచ్చారు.