విశాఖలో వైసీపీ 'వంచన వ్యతిరేక దీక్ష'

విశాఖలో వైసీపీ 'వంచన వ్యతిరేక దీక్ష'

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, ఏపీ ప్రభుత్వాల తీరుకి నిరసనగా వైసీపీ విశాఖపట్నంలో 'వంచన వ్యతిరేక దీక్ష' చేపట్టింది. విశాఖపట్నంలోని మహిళా డిగ్రీ కాలేజీ ఎదుట కొద్దిసేపటి క్రితం దీక్ష ప్రారంభమయింది. ఈ వంచన వ్యతిరేక దీక్షలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు ధరించి కూర్చున్నారు. అధికార పార్టీ టీడీపీకి పోటీగా వైసీపీ ఇవాళ వంచన వ్యతిరేక దీక్షను నిర్వహిస్తోంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు విశాఖలో 12 గంటల పాటు నిరాహార దీక్షకు దిగుతున్నారు. మోదీ, చంద్రబాబులకు వ్యతిరేకంగా ఈ దీక్షను చేస్తున్నారు. ఈ దీక్షకు పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. అయితే ఈ దీక్ష ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు జరుగుతుంది.