టీడీపీకి ధర్మం అంటే అర్థం తెలుసా?

టీడీపీకి ధర్మం అంటే అర్థం తెలుసా?

తెలుగుదేశం పార్టీకి ధర్మం అంటే అర్థం తెలుసా అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి... విశాఖలో జరుగుతున్న వంచన వ్యతిరేక దీక్షలో ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదాపై చంద్రబాబు పిల్లిమొగ్గలేశారని... ప్రత్యేక హోదాను నీరుగార్చిందే చంద్రబాబుఅని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో టీడీపీ నేతల విలాసాలు చేస్తున్నారని విమర్శించిన సాయిరెడ్డి... దోచుకున్న రూ.3 లక్షల కోట్లు హవాలా ద్వారా తరలించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో సింగపూర్‌లో ఆస్తులు కూడబెట్టారంటూ విమర్శలు గుప్పించిన సాయిరెడ్డి... టీడీపీకి ధర్మం అంటే అర్థమే తెలియన్నారు. 

టీడీపీ దొంగనాటకాలడుతోందంటూ మండిపడ్డారు సాయిరెడ్డి... టీడీపీ నిర్వహిస్తోంది అధర్మ పోరాట సభ అని ద్వజమెత్తిన ఆయన... టీడీపీ ద్వంద్వ ప్రమాణాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్రమే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామంటే... తామే కడతామని చంద్రబాబు ఎందుకు చెప్పారో ఆయనకే తెలుసన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా... బీజేపీ, టీడీపీ ప్రజలను వంచించాయన్నారు. తిరుమల కొండపై బీజేపీతో దోస్తీ... కిందేమో కుస్తీ అన్నట్టుగా చంద్రబాబు తీరుందన్న సాయిరెడ్డి... ప్రత్యేక హోదా ఇస్తేనే ప్రమాణస్వీకారం చేస్తానని చంద్రబాబు కండీషన్ పెట్టిఉంటే అప్పుడే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదన్నారు.