కృష్ణా జిల్లాకు 'ఎన్టీఆర్' పేరు...

కృష్ణా జిల్లాకు 'ఎన్టీఆర్' పేరు...

కృష్ణా జిల్లాను 'ఎన్టీఆర్' జిల్లాగా మార్చుతామని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజాసమస్యలు తెలుసుకోవడం, ప్రజలకు దగ్గరవడమే లక్ష్యంగా వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌  జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర సోమవారం కృష్ణా జిల్లా నిమ్మకూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి రాగానే కృష్ణా  జిల్లాకు 'నందమూరి తారక రామారావు' పేరు పెడతామని హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత నిమ్మకూరును, కృష్ణా జిల్లాను అన్ని విధాలుగా మారుస్తాను అని జగన్ చెప్పారు. దీంతో  అక్కడున్నవారంతా "జై జగన్" అంటూ హర్షధ్వానాలు చేశారు. ఈ యాత్రలో ఎన్టీఆర్ బంధువులు కొందరు వైఎస్ జగన్‌తో మాట్లాడారు. జగన్ పాదయాత్ర పామర్రు మీదుగా మచిలీపట్నం వైపు కొనసాగుతోంది. మరింత సమాచారం కోసం వీడియోను క్లిక్ చేయండి. 

https://www.youtube.com/watch?v=h7m-AqiGp2M