ఇప్పటి వరకు 9.99 లక్షల మందికి వ్యాక్సినేషన్‌

ఇప్పటి వరకు 9.99 లక్షల మందికి వ్యాక్సినేషన్‌

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ చురుకుగా కొనసాగుతోంది... ముందుగా కరోనా వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ జరుగుతోంది... ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా మొత్తం 9,99,065 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది... మీడియాతో మాట్లడిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నిని... ఇప్పటి వరకు 27 రాష్ట్రాలు మరియు యూటీల్లో టీకా సెషన్లు నిర్వహించామని.. ఇవాళ మొత్తం 1,92,581 మంది లబ్ధిదారులకు టీకాలు వేవామని.. దీంతో వ్యాక్సిన్‌ లబ్ధిదారుల సంఖ్య 9.99 లక్షలకు చేరిందన్నారు. ఇక, ఇవాళ వ్యాక్సిన్‌ మూలంగా ఎలాంటి మరణాలు సంభవించలేదన్నారు. కాగా, కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు రెండు వ్యాక్సిన్లకు కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే.. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌తో పలువురు అస్వస్థతకు గురైనా.. తిరిగి పూర్తిస్థాయిలో కోలుకుంటున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి భయపడొద్దని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది.