జీహెచ్ఎంసిలో భారీగా పెరిగిన కేసులు... 24 గంటల్లో... 

జీహెచ్ఎంసిలో భారీగా పెరిగిన కేసులు... 24 గంటల్లో... 

తెలంగాణలో కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.  నిన్నటి రోజున తెలంగాణలో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. అయితే, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 983 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 14,419కి చేరింది.  ఇందులో 9వేలు యాక్టివ్ కేసులు ఉండగా, 5172 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో నలుగురు కరోనాతో మరణించారు.  దీంతో మొత్తం మరణాల సంఖ్య 247కి చేరింది.  కొత్తగా నమోదైన 983 కేసుల్లో జీహెచ్ఎంసి పరిధిలోనే 816 కేసులు నమోదు కావడం విశేషం.  ఇక జిల్లాల వారీగా తీసుకుంటే, రంగారెడ్డిలో 47, మేడ్చల్ లో 29, నల్గొండ 3, సంగారెడ్డి 1, భద్రాద్రి కొత్తగూడెం 5, కరీంనగర్ 3, సిద్ధిపేట 3, వరంగల్ అర్బన్ 12, మహబూబ్ నగర్ 1, ఆదిలాబాద్ 2, ఖమ్మం 3, జనగాం 1, మంచిర్యాల 33, మెదక్ 1, సూర్యాపేట 1, గద్వాల్ 2, నిజామాబాద్ 1, వరంగల్ రూరల్ 19 కేసులు నమోదయ్యాయి.