ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు... ఒక్కరోజులో వందకు పైగా మరణాలు.. 

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు... ఒక్కరోజులో వందకు పైగా మరణాలు.. 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి.  తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 9597 కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,54,146కి చేరింది.  ఇందులో 90,425 కేసులు యాక్టివ్ గా ఉంటె, 1,61,425 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో అత్యధికంగా 103 కరోనా మరణాలు సంభవించాయి.  దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 2296కి చేరింది.  

ఇక జిల్లాల వారీగా నమోదైన కేసుల విషయం తీసుకుంటే, అనంతపూర్ లో 781, చిత్తూరులో 1235, తూర్పు గోదావరిలో 1332, గుంటూరులో 762, కడపలో 364, కృష్ణాలో 335, కర్నూలులో 781, నెల్లూరులో 723, ప్రకాశంలో 454, శ్రీకాకుళంలో 511, విశాఖపట్నంలో 797, విజయనగరంలో 593, పశ్చిమ గోదావరిలో 929 కేసులు నమోదయ్యాయి.