గ్రేటర్ : ఎన్ని నామినేషన్లు తిరస్కరించారంటే ?

గ్రేటర్ : ఎన్ని నామినేషన్లు తిరస్కరించారంటే ?

జిహెచ్ఎంసి ఎన్నికలకు నామినేషన్ల పరిశీలనలో 90 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 1893 మంది అభ్యర్థులు 2575 నామినేషన్లు దాఖలు చేయగా వీటిలో నేడు జరిపిన నామినేషన్ల పరిశీలనలో 90 నామినేషన్లను సంబంధిత రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. తిరస్కరణకు గురైన నామినేషన్ల అనంతరం బి.జె.పి నుంచి 539, సి.పి.ఐ నుంచి 22, సి.పి.ఐ(ఎం) నుండి 19, కాంగ్రెస్ నుంచి 348, ఎం.ఐ.ఎం నుండి 72, టి.ఆర్.ఎస్ నుండి 527 మంది, టి.డి.పి నుండి 202, రికగ్నైజ్డ్, రిజిస్టర్ పొలిటికల్ పార్టీల నుండి 143, స్వతంత్రులు 613 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. కాగా రేపు, ఆదివారం, నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. ఇక గాజుల రామారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో హైకోర్టు లో కాంగ్రెస్ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.