మౌంట్ కిలిమంజారోను అధిరోహించిన భారత చిన్నారి
ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారో పర్వతాన్ని భారత్ కు చెందిన చిన్నారి అధిరోహించింది. 5685 మీటర్ల ఎత్తున్న ఈ పర్వతాన్ని ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన రిత్విక శ్రీ అధిరోహించి రికార్డ్ సృష్టించింది. ఆసియాలో అత్యంత పిన్నవయసులో మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన చిన్నారిగా రిత్విక చరిత్రకెక్కింది. ప్రపంచంలో రెండో చిన్నారిగా పేరు నమోదు చేసుకుంది. అత్యంత ఎత్తైన పర్వతాల్లో వాతావరణం అనుకూలించని విధంగా ఉండే వాటిల్లో కిలిమంజారో మొదటిస్థానములో ఉంటుంది. ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో పాటుగా, వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతుంది. అన్ని పరిస్థితులను తట్టుకొని చిన్నారి రిత్విక శ్రీ సాహసం చేసింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)