ఏపీలో 64 మంది మృతి.. భారీగా కొత్త కేసులు..

ఏపీలో 64 మంది మృతి.. భారీగా కొత్త కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రతీరోజు 10వేలకు పైగా నమోదు అవుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి... ప్రస్తుతం 10 లోపే కేసులు నమోదు అవుతున్నా.. అదికూడా భారీగానే ఉంది. ఇక, మృతుల సంఖ్య 60పైగా నమోదు అవుతూ ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 8,835 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... 64 మంది మృతిచెందారు. దీంతో.. ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,92,760కు చేరుకోగా.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,105 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాబారినపడి 4,97,376 మంది కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 90,279 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 75,013 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 48,06,879కు పెరిగింది.