ఈ బంధం ధృడమైనది..! కరోనా వచ్చినా భార్యను వదలని వృద్ధుడు..

ఈ బంధం ధృడమైనది..! కరోనా వచ్చినా భార్యను వదలని వృద్ధుడు..

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తోంది... ఆ వైరస్ వచ్చిందంటే చాలు... బాధితులు వారి కుటుంబసభ్యులకు దూరంగా ఉండాల్సిందే.. లేకపోతే వారు కూడా ఆ మాయదారి వైరస్ బారినపడడం ఖాయం. అయితే, ఓ 87 వృద్ధుడు మాత్రం... తాను కట్టుకున్న భార్యను వదిలి ఉండలేకపోయాడు... వైరస్ సోకిన తన భార్యకు తానే అన్నీ చూసుకుంటున్నాడు... ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వృద్ధుడు.. కరోనా వైరస్ సోకిన తన భార్యకు తనే స్వయంగా ఆహారం తినిపిస్తున్నాడు.. బాధితురాలి దగ్గరకు వెళ్లొద్దని వైద్యులు వారించినా.. వినిపించుకోకుండా.. తనకూ ఆ వైరస్ వచ్చినా పర్వాలేదంటూ... తన భార్య దగ్గరే ఉంటూ ఆమెకు సపర్యలు చేసాడు ఆ వృద్ధుడు. మాయదారి రోగాన్ని సైతం లెక్కచేయకుండా... తమ బంధానికి ఎంతో విలువ ఇచ్చి... తన భార్యను చూసుకున్నాడు.. అయితే, ఆ వృద్ధుడికి కూడా కరోనా వైరస్ సోకింది.. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. కానీ, తన భార్య పట్ల ఆ పెద్దాయన చూపించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది...