08 డిసెంబర్ 2018 శనివారం మీ రాశి ఫలాలు

08 డిసెంబర్ 2018 శనివారం మీ రాశి ఫలాలు

మేషం: 
రోజంతా అనుకూలంగా ఉంటుంది. అధికారులు, సహోద్యోగులతో స్నేహ పూర్వకంగా ఉంటారు. అనుకోని వివాదాలకు అవకాశముంది. దూరపు బంధువులను కలుస్తారు. శివారాధన చేయండి.
వృషభం: 
జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. పిల్లలు ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం, దేవాలయ సందర్శన చేస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల  ఫలితాలుంటాయి.
మిథునం: 
చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం. కుటుంబ సభ్యులను కలుస్తారు. 
కర్కాటకం: 
 డబ్బు విషయంలో సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవటం, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార  లావాదేవీలకు అనువైన దినం కాదు. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవరాధన మంచిది. 
సింహం: 
ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం  విషయంలో జాగ్రత్త అవసరం. 
కన్య: 
ఆర్థికంగా చాలా అనుకూలంచే దినం. బకాయిలు వసూలు అవుతాయి. మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీరుస్తారు. అనుకొని డబ్బు, చేపట్టిన పనిలో విజయం వరిస్తుంది. ఉద్యోగ విషయంలో ఒక  శుభవార్త వింటారు.
తుల: 
చేపట్టిన పనులు వాయిదా పడటం, అనుకోని అడ్డంకులు రావటం జరగవచ్చు. పట్టువదలక ప్రయత్నించండి.. విజయం మీదే. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే  అవకాశముంటుంది. ప్రయాణంలో జాగ్రత్త. 
వృశ్చికం: 
ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు.
ధనుస్సు:
 ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంటుంది. ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని  ప్రయాణం చేయకండి.
మకరం: 
లాభ దాయకంగా ఉంటుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం  బాగుంటుంది.
కుంభం: 
వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. మీ ప్రతిభకు  గుర్తింపు లభిస్తుంది. 
మీనం: 
ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయం లో కొంత జాగ్రత్త అవసరం. రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశం ఉంది.