ఇండియాలో కరోనా విజృంభణ: 1045 మరణాలు 

ఇండియాలో కరోనా విజృంభణ: 1045 మరణాలు 

ఇండియాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసింది.  దీని ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 78357 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 37,69,523కి చేరింది.  ఇందులో 29,01,908 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  8,01,282 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1045 మరణాలు సంభవించాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 66,333కి చేరింది.  కేసుల సంఖ్యతో పాటుగా మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది.