ఇండియాలో తగ్గిన కరోనా కేసులు... 776 మరణాలు 

ఇండియాలో తగ్గిన కరోనా కేసులు... 776 మరణాలు 

ఇండియాలో నిన్నటి వరకు ప్రతిరోజూ 80వేలకు పైగా కేసులు నమోదవుతూ వస్తుండగా ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం 70,589 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 61,45,292కి చేరింది.  ఇందులో 9,47,576 కేసులు యాక్టివ్ గా ఉంటె, 51,01,398 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  అటు మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.  గడిచిన 24 గంటల్లో ఇండియాలో 776 మరణాలు సంభవించాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 96,318 కి చేరింది.  కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే మరికొన్ని రాష్ట్రాల్లో తగ్గినట్టే తగ్గి తిరిగి కేసులు పెరుగుతున్నాయి.  ఢిల్లీ, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.