పాతబస్తీలో దారుణం.. రెండేళ్ల చిన్నారిపై...

పాతబస్తీలో దారుణం.. రెండేళ్ల చిన్నారిపై...

కాటికి కాలుచాపిన పండు ముదుసలి ఓ పసిపాపపై అత్యాచారానికి తెగబడ్డాడు. చాక్లెట్ ఇస్తానని చెప్పి చిన్నారిని ఎత్తుకెళ్లిన కామాందుడు.. నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లి పసిపాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు .. హైదరాబాద్ పాతబస్తీలోని మొగల్ పురా సుల్తాన్ షాహీలో ఈ దారుణం జరిగింది. పసిపాపలు ఒంటరిగా కనిపిస్తే చాలూ.. మాయమాటలు చెప్పి..చాక్లెట్లు ఇస్తానని నమ్మించి ఇలా చిన్నారులను ఎత్తుకెళ్తాడని 70 ఏళ్ల వృద్ధుడు జబ్బార్‌పై స్థానికులు మండిపడుతున్నారు. పాతబస్తీ సుల్తాన్ షాహీ బస్తీలో గతంలో కూడా ఇలానే ఇద్దరు బాలికలపై జబ్బార్ అత్యాచారం చేశాడని.. ఇప్పుడు మరో చిన్నారిపై లైంగికదాడికి ఒడిగట్టాడంటున్నారు స్థానికులు. తన ప్లాన్ ప్రకారం పాప తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయగా.. పాప ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడి వెళ్లి.. కామాంధుడు జబ్బార్ కు దేహశుద్ది చేశారు. పోలీసులకు పట్టిద్దామని ప్రయత్నించేసరికి అక్కడి నుంచి పారిపోయాడు.