70 కోట్లతో బీసీలకు ఆత్మగౌరవ భవనాలు

70 కోట్లతో బీసీలకు ఆత్మగౌరవ భవనాలు

ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. బీసీలకు  హైదరాబాద్‌లో 70 కోట్లతో 71 ఎకరాల్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించిందని ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ కోసం 5 ఎకరాలు కేటాయింపు,  గోపాల మిత్రులకు వేతనం రూ. 3,500 నుంచి రూ. 8500 పెంపు, అర్చకుల పదవీ విరమణ వయసు 58 నుంచి 65 ఏండ్లకు పెంపు, ఆశా కార్యకర్తల గౌరవ వేతనం రూ. 6 వేల నుంచి  7500లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంలుకు రూ.11 వేల నుంచి రూ. 21 వేలకు పెంచారు. ఎన్‌యూహెచ్‌ఎంలో పని చేస్తున్న 9  వేల మందికి కనీస వేతనాలు పెంపు.. కాంట్రాక్ట్ డాక్టర్ల వేతనం రూ. 40 వేలకు పెంచినట్లు ఈటల రాజేందర్ ప్రకటించారు.