ఇండియాలో కాస్త తగ్గిన కరోనా కేసులు... 24 గంటల్లో...  

ఇండియాలో కాస్త తగ్గిన కరోనా కేసులు... 24 గంటల్లో...  

ఇండియాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.  నిన్నటి వరకు రోజుకు 75 వేలకు పైగా కేసులు నమోదవుతూ వచ్చాయి.  ఈరోజు ఈ సంఖ్య కాస్త తగ్గింది.  గడిచిన 24 గంటల్లో ఇండియాలో 69,921కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,91,173కి చేరింది.  ఇందులో 28,39,882 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,85,996 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 819 మంది కరోనాతో మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 65,288కి చేరింది.  ఇక గడిచిన 24 గంటలో ఇండియాలో 65,081 మంది డిశ్చార్జ్ అయ్యినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ పేర్కొన్నది.