అమెరికాను వణికిస్తున్న కరోనా... ఒక్కరోజులో 68వేల కొత్త కేసులు...  

అమెరికాను వణికిస్తున్న కరోనా... ఒక్కరోజులో 68వేల కొత్త కేసులు...  

అగ్రరాజ్యం అమెరికాను కరోనా కేసులు వణికిస్తున్నాయి.  గతంలో రోజుకు 25 నుంచి 30 వేల వరకు కేసులు నమోదవుతుండేవి.  ఏప్రిల్ తరువాత అమెరికాలో కొంతమేర కేసులు తగ్గుముఖం పట్టాయి.  అయితే, జూన్ మిడిల్ నుంచి అమెరికాలో తిరిగి కేసులు పెరగడం ప్రారంభించాయి.  గత మూడు రోజులుగా అమెరికాలో 65వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  

అయితే, నిన్న ఒక్కరోజే అమెరికాలో రికార్డ్ స్థాయిలో 68వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇప్పటి వరకు ఆ దేశంలో 32,91,786 కేసులు నమోదయ్యాయి.  ఇక నిన్నటి రోజున అమెరికాలో 849 మంది మరణించారు.  కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.  అలస్కా, జార్జియా, ఇడాహో, లూసియానా, మోంటానా, ఒహియో, ఉటా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.