ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు... 24 గంటల్లో 

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు... 24 గంటల్లో 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  నిన్నటి రోజున కొంత తగ్గుముఖం పట్టిన కేసులు ఈరోజు మరలా పెరిగాయి.  గడిచిన 24 గంటల్లో ఏపీలో 68 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  10 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఒకరు మరణించారు.  దీంతో రాష్ట్రంలో మొత్తం 2787 కరోనా కేసులు నమోదయ్యాయి.  1913 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 816 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  మొత్తం మీద ఇప్పటి వరకు కరోనా కారణంగా 58 మంది మరణించారు.  

అటు ఇండియాలో సైతం భారీగా కేసులు నమోదవుతున్నాయి.  ఇండియాలో 24 గంటల్లో 6387 కొత్త కేసులు నమోదైన సంగతి తెలిసిందే.  దీంతో ఇండియాలో కేసుల సంఖ్య 1.50 లక్షలు దాటిపోయింది.  ప్రతి రోజు ఆరువేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి.  ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.