తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు... 24 గంటల్లో... 

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు... 24 గంటల్లో... 

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఆగడం లేదు.  తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేసింది.  బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 66 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దీంతో మొత్తం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్యా 1920కి చేరింది.  ఈరోజు కరోనా వలన ముగ్గురు మరణించారు.  దీంతో మొత్తం కరోనాతో మరణించిన వారిసంఖ్య 56 కి చేరింది.  గడిచిన 24 గంటల్లో 72 మంది డిశ్చార్జ్ అయ్యారు.  దీంతో మొత్తం 1164 మంది డిశ్చార్జ్ అయ్యారు.  ఈరోజు నమోదైన 66 కేసుల్లో జీహెచ్ఎంసి పరిధిలో 31 కేసులు, రంగారెడ్డిలో 1, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లలో 15, విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో 18 మందికి కరోనా సోకింది.  మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒకరికి కూడా కరోనా సోకింది.  లాక్ డౌన్ 4 ముగింపు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను తిరిగి పెంచుతారా లేదంటే ఎత్తేస్తారా చూడాలి.