భార‌త్‌లో క‌రోనా క‌ల్లోలం.. 25 ల‌క్ష‌లు దాటిన పాజిటివ్ కేసులు

 భార‌త్‌లో క‌రోనా క‌ల్లోలం.. 25 ల‌క్ష‌లు దాటిన పాజిటివ్ కేసులు

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ క‌ల్లోలం సృష్టిస్తోంది.. ఈ మ‌ధ్య 50 వేలు దాటి.. 60 వేల‌ను కూడా క్రాస్ చేసి రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి క‌రోనా పాజిటివ్ కేసులు... ఇవాళ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ విడుద‌ల చేసిన క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంటల్లో అత్యధికంగా 65,002 కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. ఇదే స‌మ‌యంలో.. 996  మంది మృతి చెందారు.. ఇక‌, గడచిన 24 గంటలల్లో దేశ వ్యాప్తంగా 57,381 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. 

దేశంలో ఇప్పటివరకు న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసులు 25 ల‌క్ష‌ల మార్క్‌ను క్రాస్ చేసి.. 25,26,192కు చేరుకోగా.. మృతిచెందిన‌వారి సంఖ్య 49,036కు పెరిగింది.. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 6,68,220 యాక్టివ్ కేసులు  ఉన్నాయి.. క‌రోనాబారిన‌బ‌డి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 18,08,936కు చేరింది.. దీంతో... దేశంలో  క‌రోనా రోగుల రిక‌రీ రేటు 71.77 శాతానికి పెరిగింది. దేశంలో న‌మోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 26.88 శాతంగా ఉన్నాయి.. ఇక‌, డెత్‌రేట్‌ 1.95 శాతంగా ఉంది.. మ‌రోవైపు.. గడచిన 24 గంటల్లో 8,68,679 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 2,85,63,095కు చేరింది.