మగపిల్లవాడి కోసం ఆ పెద్దాయన ఏం చేశాడో చూశారా ? 

మగపిల్లవాడి కోసం ఆ పెద్దాయన ఏం చేశాడో చూశారా ? 

మగపిల్లవాడు ఇంటికి వారసుడు అవుతాడని, మగపిల్లవాడు కావాలని చాలామంది అనుకుంటారు.  అలా అనుకోవడమే కాదు, మగపిల్లవాడి కోసం చాలా ప్రయత్నం చేస్తుంటారు.  అలానే హైదరాబాద్ లోని పంజాగుట్టకు చెందిన ఓ వ్యక్తికూడా ప్రయత్నం చేశారు.  మొదట మగపిల్లవాడి కోసం సరోగసి విధానం ద్వారా ఓ మహిళతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమెకు నాలుగు లక్షలు డబ్బు ఇచ్చే విధంగా డీల్.  అలానే నెలకు 10వేలరూపాయలు డబ్బులు ఇచ్చే విధంగా కూడా డీల్ కుదుర్చుకున్నారు.  

మరి ఏమైందో ఏమో తెలియదుగాని, ఆ తరువాత సదరు వ్యక్తి మాట మార్చి సరోగసి విధానం ద్వారా కాకుండా డైరెక్ట్ గా కలిసి మగపిల్లవాడిని కనాలని ఒత్తిడి తీసుకొచ్చారు.  దీంతో సదరు మహిళ ఈ విషయాన్ని భర్తతో చెప్పింది.  ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  నిందితుడు స్వరూపరాజు, మధ్యవర్తిగా ఉన్న నూర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.