ఇండియాలో భారీగా నమోదైన కరోనా కేసులు... 944 మరణాలు
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 63,490కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,89,682కి చేరింది . ఇందులో 6,77,444 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 18,62,258 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 944 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 49,980కి చేరింది. రోజు రోజుకు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 53,322 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)