తెలంగాణలో అమాంతం పెరిగిన కరోనా కేసులు..

తెలంగాణలో అమాంతం పెరిగిన కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల అమాంతం పెరిగిపోయింది.. మొన్న 27 కేసులకే పరిమితం కాగా.. నిన్న ఒకే రోజు 38 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇవాళ ఏకంగా 62 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.. తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 62 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరోవైపు ఒకే రోజు ముగ్గురు మృతిచెందారు.. దీంతో.. ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,761 చేరగా.. కరోనా బారినపడి ప్రాణాలు విడిచనవారి సంఖ్య 48కి పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 670 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇవాళ ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో.. ఇప్పటి వరకు 1,043 మంది డిశ్చార్జ్ అయినట్టు అయ్యింది.. ఇక, ఇవాళ నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 42 కేసులు ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో ఒకటి.. ఇతర రాష్ట్రాలకు చెందినవారు 19 మంది ఉన్నారు.