ఆర్బీఐ కొత్త రూల్స్.. ఆ సొమ్ముపై 5 శాతం పన్ను..!

ఆర్బీఐ కొత్త రూల్స్.. ఆ సొమ్ముపై 5 శాతం పన్ను..!

కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ఆర్బీఐ పలు పన్నులను ఎత్తివేసింది.. ఇక, అన్‌లాక్‌లోకి అడుగుపెట్టిన తర్వాత.. క్రమంగా సాధారణ చార్జీలు వసూలు చేస్తూనే ఉన్నారు.. ఈ నెల 1వ తేదీ నుంచి వడ్డింపుల పర్వం ఎక్కువైంది. ఇదే సమయంలో.. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీంలో ఆర్బీఐ మార్పులకు పూనుకుంది. ఈ స్కీం కింద విదేశాలకు డబ్బు పంపే వారికి 5 శాతం చొప్పున టీసీఎస్ వసూలు చేయనున్నారు. ఈ విధానం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఆర్బీఐ. ఈ నిబంధనను ఫైనాన్స్ యాక్ట్ 2020లో తీసుకురాగా.. ఫిబ్రవరిలో ప్రభుత్వం 206 సీ సెక్షన్‌కు సవరణను ప్రతిపాదించి.. విదేశీ చెల్లింపులు, విదేశీ టూర్ ప్యాకేజీలపై 5 శాతం టీసీఎస్ విధించాలనే నిర్ణయానికి వచ్చింది. 

ఇక, ఈ కొత్త నిబంధనలను అమలు చేయడానికి మార్చి 27వ తేదీన నోటిఫై చేసిన ఆర్థిక చట్టం.. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. కొత్త నిబంధనల ప్రకారం పన్ను వసూళ్లను పరిశీలిస్తే.. టూర్ ప్యాకేజీ కొనడానికి కాకుండా.. భారత్‌ నుంచి విదేశాలకు పంపిన మొత్తం రూ.7 లక్షల కన్నా తక్కువ ఉంటే దానికి టీసీఎస్ వసూలు ఉండదు.. టూర్ ప్యాకేజీని కొనడానికి కాకుండా రూ.7 లక్షలకు మించి చెల్లించినట్లయితే రూ.7 లక్షలకు పైబడిన మొత్తానికి టీసీఎస్ విధిస్తారు. విదేశాలలో చదువుకోవడానికి ఒక ఆర్థిక సంస్థ జారీ చేసిన రుణాల విషయంలో రూ.7 లక్షల పరిమితికి మించి ఉన్న మొత్తంలో టీసీఎస్‌లో 0.5 శాతం మాత్రమే వసూలు చేయబడుతుంది. అంతేకాదు.. పాన్ లేదా ఆధార్‌తో చెల్లింపులు చేయకపోతే టీసీఎస్ రేటు 10 శాతం వడ్డించనున్నారు. ఆదాయపు పన్ను చట్టంలోని ఏదైనా నిబంధన టీడీఎస్‌ను పంపించాల్సిన మొత్తానికి తీసివేసి, టీడీఎస్‌ను తీసివేస్తే, ఆ మొత్తానికి టీసీఎస్ నిబంధన వర్తించబోదు.. ప్రభుత్వం లేదా ప్రభుత్వం నిర్ణయించిన వ్యక్తి విదేశాలకు డబ్బు పంపితే దానికి టీసీఎస్‌ ఉండబోదని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది.. ఇక, విదేశాలకు డబ్బు పంపించే  సదరు వ్యక్తి తన ఐటీ రిటర్న్‌లో బ్యాంక్ తీసివేసిన టీసీఎస్‌కు క్రెడిట్‌ను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెబుతున్నారు.