అదరగొడుతున్న సుందర్, అక్షర్... 365 పరుగులకు ఇండియా ఆలౌట్

అదరగొడుతున్న సుందర్, అక్షర్... 365 పరుగులకు ఇండియా ఆలౌట్

నాలుగో టెస్టులో టీం ఇండియా 365 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్‌ సుందర్‌ 96 పరుగులు, అక్షర్‌ పటేల్‌ 43 పరుగులతో రాణించడంతో టీం ఇండియా గౌరవ ప్రదమైన స్కోర్‌ చేసింది. పంత్‌ సెంచరీ చేయగా.. సుందర్‌ మాత్రం త్రుటిలో తొలి టెస్టు సెంచరీని మిస్‌ చేసుకున్నాడు. చివర్లో అక్షర్‌ పటేల్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ సిరాజ్‌ వరుస బంతుల్లో పెవిలియన్‌ బాట పట్టడంతో స్పిన్నర్‌ సుందర్‌ శతకాన్ని సాధించేలేకపోయాడు. ఇక 365 పరుగులకు ఆలౌటైన టీం ఇండియా... తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి ఇంగ్లండ్‌ జట్టు 205 పరుగులు చేసిన సంగతి విదితమే.