కరోనా అప్డేట్స్: ఇండియాలో కొత్తగా ఎన్ని కేసులంటే... 

కరోనా అప్డేట్స్: ఇండియాలో కొత్తగా ఎన్ని కేసులంటే... 

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 92 లక్షలు దాటిపోయాయి.  ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 44,376 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 92,22,217కి చేరింది.  ఇందులో 86,42,771 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,44,746 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 481మంది మృతి చెందారు.  దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,34,699 కరోనా మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 37,816మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.