మధ్యప్రదేశ్‌లో 40 మంది అరెస్ట్.. ఎందుకంటే..

మధ్యప్రదేశ్‌లో 40 మంది అరెస్ట్.. ఎందుకంటే..

భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 40 మంది జూదరులను అదుపులోకి తీసుకుంది. వారితో పాటు రూ.3లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన మద్యప్రదేశ్‌లోని ఇన్‌డోర్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే దీనికి సంబంధించిన రైడ్‌లో నాలుగు జట్లు పాల్గొన్నాయి. ఇవి ఐజీ యోగేష్ దేశ్‌ముఖ్, డీఐజీ హరినారాయణ చారీ మిశ్రాల నాయకత్వంలో రైడ్‌ను ముగించారు. ‘భాద్‌కియా గ్రామ అడవుత్తో జూదం ఆడుతున్నట్లు మాకు సమాచారం వచ్చింది. దాంతో అడవిలో రెండు జట్లు ఉన్నాయి. మరో రెండు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాయ’ని పోలీసులు తెలిపారు. ఈ రైడ్‌లో 40 మంది జూదగాళ్ళను , రూ.3.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 40 మొబైల్ ఫోన్లను, 5 సెట్ల కార్డ్స్‌ను , 5కార్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును సంబంధిత సెక్షన్‌లలో నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే తొలుత చేసిన విచారణ ప్రకారం దీనికి మోను శివ్‌హరే, గోవింద్ ఖాటిక్‌లు ఈ జూదాలను ఏర్పాటు చేస్తున్నారని, వారు బాగ్లిలో నివాసం ఉంటారని తేలింది. అయితే వారు తెల్లవారు జాము 3 గంటల వరకు ఫోన్ టార్చ్ వెలుతురులో జూదం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మరి కోన్ని వివరాల కోసం వేచి చూడాల్సిందే.