గుజరాత్ లో కెమికల్ గ్యాస్ లీక్..నలుగురు మృతి.!

గుజరాత్ లో కెమికల్ గ్యాస్ లీక్..నలుగురు మృతి.!

గుజరాత్ లో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. కెమికల్ ట్యాంక్‌ను క్లీన్ చేస్తున్న నలుగురు కార్మికులు గ్యాస్ లీక్ తో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ రూరల్ డిప్యూటీ సూపరింటెండెంట్ నితీష్ పాండే తెలిపారు. అహ్మదాబాద్‌ జిల్లాలోని ధోలీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిమెజ్ సమీపంలో ఉన్న చిరిపాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఓ కెమికల్ వెస్ట్ ట్యాంక్‌ను నలుగురు కార్మికులు శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో అందులో నుండి విషవాయువులు విడుదలయ్యాయి. దాంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.