ముగిసిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్... సెంచరీతో రాణించిన బెయిర్‌స్టో

ముగిసిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్... సెంచరీతో రాణించిన బెయిర్‌స్టో

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ఈ రోజు చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణిత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ మొదలైన మొదట ఓవర్ మొదటి రెండు బాల్స్ లోనే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ జాసన్ రాయ్, జో రూట్ ను వరుసగా పెవిలియన్ కు పంపించాడు ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్. కానీ తర్వాత ఆ జట్టు వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో(112) ఆసీస్ బౌలర్లను అంద్భుతంగా ఎదుర్కొని సెంచరీతో రాణించాడు. అతనికి తోడుగా సామ్ బిల్లింగ్స్(57), క్రిస్ వోక్స్(53) అర్ధశతకాలతో రాణించడంతో జట్టు 300 పరుగులను దాటింది. ఇక ఆసీస్ బౌర్లలో మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా 3 వికెట్లు తీసుకోగా పాట్ కమ్మిన్స్ ఒక వికెట్ సాధించాడు. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలంటే ఆసీస్ 303 పరుగులు చేయాలి. అయితే ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని ఆసీస్ ఇంత భారీ లక్ష్యాన్ని చేధించాలంటే కష్టమే అని చెప్పాలి. చూడాలి మరి ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ఎవరు గెలుస్తారు అనేది.