బ్రిస్బేన్‌ టెస్ట్‌ : అలౌటైన కంగారులు.. ఇండియా టార్గెట్‌ ఎంతటే ?

బ్రిస్బేన్‌ టెస్ట్‌ : అలౌటైన కంగారులు.. ఇండియా టార్గెట్‌ ఎంతటే ?

బ్రిస్టేన్‌ లోని గబ్బా స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు టీం ఇండియాకు భారీ టార్గెట్‌ ను నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 294 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఓవరాల్‌గా టీం ఇండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఫిక్స్‌ చేసింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 21-0 తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్‌ ఓపెనర్లు టీం ఇండియా సహనాన్ని పరీక్షించారు. దాదాపు 20 ఓవర్లు వికెట్‌ పడకుండా నిలకడగా ఆడుతూ పరుగులు సాధించారు. అయితే... మహ్మద్‌ సిరాజ్‌ దాటికి ఆసీస్‌ బ్యాట్స్‌మెన్స్‌ క్రీజులో నిలవలేకపోయారు. సిరాజ్‌ ఐదు వికెట్లు ఖాతాలో వేసుకుని కెరీర్‌ లో ఉత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. శార్దూల్‌ ఠాకూర్‌ 4, వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఆసీస్‌ ఓపెనర్లు మార్కస్‌ హేరిస్‌ 38, డేవిడ్‌ వార్నర్‌ 48 పరుగులతో రాణించారు. వారితో పాటు స్టీవ్‌ స్మిత్‌ 55, కామెరూన్‌ గ్రీన్‌ 37 పరుగులు చేసి.. ఆసీస్‌ జట్టుకు భారీ స్కోరు అందించారు.