లొంగిపోయిన 32 మంది నక్సల్స్

లొంగిపోయిన 32 మంది నక్సల్స్

రాయ్‌పూర్: ఛత్తీస్‌ఘర్‌లో లొంగిపోయిన నక్సలైట్స్. మీ పని తీరుకు ఫిదా అయ్యామంటూ పోలీసుల పనితీరును పొగిడారు. అయితే ఈ ఘటన బర్సూర్ పోలీస్టేషన్‌లో జరిగింది. మొత్తం 32 మంది నక్సల్స్ లొంగిపోగా వారిలో 10 మంది మహిళలు ఉన్నరని దంతెవేదా ఎస్‌పీ అభిషేక్ పల్లవ చెప్పారు. అయితే లొంగిపోయిన వారిని ఎంతో మెచ్చుకున్నారు. ‘మొత్తం 32 మంది లొంగిపోయారు. వారిలో 6 గురిపై రివార్డుకూడా ఉంది. అయితే వీరు ‘లోనే వరాతు’ అనే నినాదాన్ని చేశారు. దానికి ఇంటికి తిరిగి రండి అని అర్థం. ఈ విధంగా ఈ మూడు నెలల్లో దాదాపు 150 మంది నక్సల్స్ లొంగిపోయారు. వారిలో దాదాపు 42 మందిపై బహుమతి ప్రకటించబడి ఉంది. సుమారు 50 నుంచి 60 మంది వరకూ లొంగిపోవాలనే వచ్చార’ని పల్లవా చెప్పారు. లొంగి వారిలో 6గురిపై నాలుగు లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.