ప్రేయసి కోసం 300 ఫ్లెక్సీలు!
ప్రేమికుల మధ్య విభేదాలు వస్తే ఏం చేస్తారు? సారీ చెప్పో.. గిఫ్ట్ ఇచ్చో కూల్ చేస్తారు. కానీ మహారాష్ట్రకు చెందిన ఓ ప్రియుడు.. ఏకంగా 300 ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి 'ఐ యామ్ సారీ' అని చెప్పాడు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి చెందిన నీలేష్ ఖేడేకర్(25)కు తన ప్రేయసితో మాటామాటా వచ్చింది. ఆమె మదిలో కోపాన్ని పోగొట్టేందుకు నీలేష్..ఓ వినూత్న ఆలోచన చేశాడు. ప్రియురాలు తన స్వగ్రామానికి వస్తోందని తెలుసుకుని.. ఆమె వచ్చే దారిలో ఏకంగా 300 'ఐ యామ్ సారీ' హోర్డింగులు ఏర్పాటు చేశాడు. ఇందుకోసం రూ.72వేలు ఖర్చుచేశాడు. ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు నీలేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా హోర్డింగులు పెట్టినందుకు కేసు నమోదు చేశారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)