పవర్‌ఫుల్ చిత్రం "కర్తవ్యం" @ 30

పవర్‌ఫుల్ చిత్రం "కర్తవ్యం" @ 30

విజయశాంతి నటించిన పవర్‌ఫుల్ చిత్రం కర్తవ్యం.ఈ సినిమాతో స్టార్ హీరోలకు సమానంగా మారిపోయింది విజయశాంతి . సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతీగా విజయశాంతి బాక్సాఫీస్ వద్ద సత్తాను చాటారు. 'కర్తవ్యం' సినిమా విడుదలై నేటికి 30 వసంతాలవుతుంది.1990 జూన్ 29న విడుదలైన కర్తవ్యం చిత్రం విజయశాంతికి యాక్షన్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చి పెట్టింది. లేడీ ఐపీయస్ ఆఫీసర్ కిరణ్ బేడీ ప్రేరణతో సినిమా చేద్దామని డైరెక్టర్ మోహన్‌గాంధీ చెప్పగానే నిర్మాత ఎ.ఎం.రత్నం వెంటనే ఒకే చేశారట ఈ సినిమాకు. పరుచూరి బ్రదర్స్ కథను సిద్ధం చేశారు. 1989 నవంబర్ 2న చిత్ర షూటంగ్ మొదలు కాగా, కిరణ్ బేడీ క్లాప్ కొట్టారు. ఆ రోజుల్లోనే ఈ సినిమా మూడు కోట్ల రూపాయలను వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.