దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు లో మళ్ళీ కరోనా కలకలం...

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు లో మళ్ళీ కరోనా కలకలం...

దక్షిణాఫ్రికా క్రికెట్ లో మళ్ళీ కరోనా కలకలం రేపుతోంది. కేప్ టౌన్ లో నిర్వహించిన కరోనా పరీక్షలో దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు పాజిటివ్ గా వచ్చింది అని... దాంతో వారిని ఒంటరిగా ఉంచినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరు అనేది మాత్రం తెలుపలేదు. ఇక కేప్ టౌన్‌లో నవంబర్ 27 నుంచి దక్షిణాఫ్రికా 3 టీ 20, 3 వన్డేల సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టుకు ఆతిథ్యమివ్వనుంది. అయితే పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లకు ఎవరికీ కరోనా లక్షలను కనిపించడం లేదు అని క్రికెట్ బోర్డు చెప్పింది. ఈ పాజిటివ్ వచ్చిన ఆటగాళ్ల స్థానంలో కొత్తగా ఎవరిని జట్టులోకి తీసుకోలేదు. కానీ ఈ మ్యాచ్ ల కంటే ముందు జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్ ల కోసం మాత్రం ఇద్దరు ఆటగాళ్లు జట్టులో చేరనున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సిరీస్ లు కూడా బయో బబుల్ లోనే ప్రేక్షకులు లేకుండా జరగనున్నాయి.