పాక్ జట్టు లో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా

పాక్ జట్టు లో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా

పాకిస్థాన్ క్రికెట్ జట్టు లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో జట్టులో కరోనా కేసుల సంఖ్య 10 కి చేరింది. తాజాగా పాకిస్థాన్ యూనిట్‌లోని మొత్తం 46 మంది సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. న్యూజిలాండ్‌లో డిసెంబర్ 18 నుండి 3 మ్యాచ్‌ల టీ20 ఐ సిరీస్ మరియు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో తలపడనుంది. ఈ పర్యటన జనవరి 7 తో ముగుస్తుంది. అయితే ఇందుకోసం మొత్తం 54 మంది ఆటగాళ్లు కివీస్ కు వెళ్లారు. అయితే అక్కడ వారు కరోనా నియమాలను పాటించకపోవడం తో మొదట ఆరుగురు, తర్వాత ఒక్కరు ఇప్పుడు ముగ్గురు ఆటగాళ్లు ఈ విటర్ బారిన పడ్డారు.