తెలంగాణ కరోనా అప్డేట్: ఈరోజు ఎన్నంటే... 

తెలంగాణ కరోనా అప్డేట్: ఈరోజు ఎన్నంటే... 

తెలంగాణలో కరోనా కేసులో స్వల్పంగా పెరిగాయి.  నిన్న రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 249 కరోనా కేసులు నమోదు కాగా, ఈరోజు రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం కొత్తగా 299 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,91,666 కరోనా కేసులు నమోదయ్యాయి.  ఇందులో 2,85,898 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,191 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక తెలంగాణలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1577కి చేరింది. నిన్నటి నుంచి రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.  145 సెంటర్లలో నిన్న కరోనా వ్యాక్సిన్ ను అందించారు.