మయన్మార్ నిరసనలు: పోలీసుల కాల్పులు...33 మంది మృతి

మయన్మార్ నిరసనలు: పోలీసుల కాల్పులు...33 మంది మృతి

మయన్మార్ లో ప్రస్తుతం సైనిక పాలన కొనసాగుతోంది.  ఆంగ్ సాంగ్ సూకీ ప్రభుత్వం ఏర్పాటు కాబోయే సమయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తూ సైనికులు తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.  సైనిక పాలన అమలులోకి రావడంతో అక్కడి ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు.  నిరసనలు చేస్తున్నారు.  దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.  ఆందోళనలు ఉదృతం కావడంతో, నిరసనకారులపై పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.  ఈ కాల్పుల్లో ఇప్పటికే 33 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.  ఈ చర్యను ప్రపంచ దేశాలు విమర్శిస్తున్నాయి.  మయన్మార్ పై ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది.  మయన్మార్ పై ఒత్తిడి తీసుకొచ్చి తిరిగి ప్రజాస్వామ్యం బద్దంగా ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూస్తామని అంటోంది అమెరికా.  అటు ఐరాస కూడా ఈ చర్యను ఖండించింది.